నా మాటలతో నేను ఉన్నప్పుడు
నా వాళ్ళతో నేను ఉన్నప్పుడు
బ్రహ్మ ముహూర్తపు సమయంలో
సన్నజాజి పరిమళంలా....
నిశ్శబ్దపు రాతిరి నా చెంత
చేరిన మిణుగురులా....
సరికొత్త దారి నుండి
అతను వచ్చాడు...
వచ్చినవాడు ఏ ఊరి
రాజకుమారుడో కానీ...
మా ఇంటి పెరడులో నాకై
నేలరాలిన విరిసిన గులాబీలా..
మా వేప చెట్టు నీడలో
ఒదిగిన నా నీడలా....
ఇక్కడ అతను
నా జ్ఞాపకం చిట్టాలో
రాజ సింహాసనం ఆక్రమించాడు..
కానీ...అక్కడ
పదేపదే నన్ను పరామర్శించే
నా కల దారి తప్పిపోయింది...
ఏం చేయను!! అందుకే
నా జ్ఞాపకాల బందీకి
తప్పిపోయిన కలను
పరిచయం చేస్తున్నా...
అతను ఓ సడిచేసే నిశ్శబ్దం
అంతుచిక్కని అపురూపం
ఏదైనా సరి చేయగలడు ....